ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'మైదాన్'

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 05, 2024, 03:41 PM

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ నటించిన 'మైదాన్' సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా రెంటల్ బేస్ పై స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా యూజర్స్ అందరికి ప్రసారానికి అందుబాటులోకి వచ్చినట్లు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం అధికారకంగా ప్రకటించింది. అమిత్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారతదేశపు లెజెండరీ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ బయోపిక్. ఈ సినిమాలో ప్రియమణి అజయ్ దేవగన్ భార్యగా నటించింది. బోనీ కపూర్ ఈ జీవిత చరిత్ర చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి AR రెహమాన్ స్వరాలు సమకూర్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa