ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మనమే' నాల్గవ సింగిల్ అవుట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 06, 2024, 05:55 PM

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు శర్వానంద్ ఒక కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ మనమే అనే టైటిల్ ని ఖరారు చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని నాల్గవ సింగల్ ని బూమ్ బూమ్ అనే టైటిల్ తో విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో శర్వాకి జోడిగా కృతి శెట్టి నటిస్తుంది. సీరత్ కపూర్, వెన్నెల కిషోర్ మరియు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాలో కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా జూన్ 7, 2024న విడుదలకి సిద్ధంగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa