SU అరుణ్ కుమార్ దర్శకత్వంలో విక్రమ్ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి వీర ధీర సూరన్ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ ఖరారు చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ని జూన్ 20న ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో SJ సూర్య, దుషార విజయన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. హెచ్ఆర్ పిక్చర్స్ పతాకంపై రియా శిబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa