ప్రేక్షకులను అలరించడానికి మరో హాలీవుడ్ సిరీస్ రెడీ అయింది. 2022 సెప్టెంబర్‌లో వచ్చిన ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ సిరీస్‌కు కొనసాగింపుగా రూపొందిన రెండో సీజన్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ విడుదల చేయగా మంచి స్పందనను రాబట్టుకుంటోంది. మొదటి నుంచి చివరి వరకు మంత్రాలు, మాయలు, కుట్రలు, యుద్దాల నేపథ్యంలోనే ఈ సిరీస్ సాగుతూ చూసే ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తుంది.ఈ సీరీస్‌లో వచ్చిన మొదటి సీజన్ ప్రైమ్ వీడియోలో స్టీమింగ్ అవగా ఎవరూ ఊహించని విధంగా కొద్ది రోజుల్లోనే ప్రపంచమంతటా 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి కొత్త రికార్డులను తిరగరాసింది. అయితే ఇప్పుడు రానున్న రెండో సీజన్ ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ను ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 29న 240లకు పైగా దేశాలలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషలలో అందుబాటులో ఉండనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa