ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షూటింగ్ ప్రారంభించిన 'సికందర్‌'

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 19, 2024, 06:14 PM

ఎఆర్ మురుగదాస్‌ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'సికందర్‌' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా షూటింగ్ ని ప్రారంభించినట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ సినిమాలో సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు లేటెస్ట్ టాక్. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు మరియు 2025 ఈద్ రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి స్టార్ మ్యూజిక్ కంపోజర్ ప్రీతమ్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమాని సాజిద్ నడియాడ్‌వాలా నిర్మించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa