ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ డ్రాగన్ అనే టైటిల్ ని లాక్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు లేటెస్ట్ టాక్. ఇటీవలే, చిత్రనిర్మాతలు ఎన్టీఆర్ 31 ఆగస్టు 2024లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారని ప్రకటించారు. షూటింగ్ దాదాపు 15 దేశాల్లో జరుగనున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ను నిర్మిస్తుంది.