అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా బహుళ భాషల్లో విడుదలైంది. రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటించిన ఈ ప్రాజెక్ట్‌కి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా గ్లోబల్ బాక్స్ఆఫీస్ వద్ద $20M వసూళ్లు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో దిశా పటాని, పశుపతి, మరియు రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మించారు.