సినిమాల విడుదలకు ముందే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అభిమానులకు ఏదో ఒక అప్డేట్తో ట్రీట్ ఇస్తూనే ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్ కాంపౌండ్ నుంచి వస్తోన్న ప్రాజెక్టుల్లో ఒకటి సూర్య 44. ఈ మూవీ షూట్ కొన్ని రోజులుగా అండమాన్ ఐలాండ్‌లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా బీచ్‌లో స్టైలిష్‌గా కూర్చున్న లుక్‌తోపాటు సెట్స్‌లో సూర్య, పూజాహెగ్డే దిగిన స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.