అనంత్ అంబానీ- రాధికా మర్చెంట్ ల వివాహం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ సెలబ్రిటీలంతా హాజరై సందడి చేశారు. రజినీ కాంత్, అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, రామ్ చరణ్, మహేశ్ బాబు, సూర్య, MS ధోనీ సహా పలువురు స్టార్స్ తమ ఫ్యామిలీతో హాజరయ్యారు. వేడుకలో నిర్వహించిన బరాత్‌లో స్టార్స్ అంతా మాస్ స్టెప్పులతో ఉర్రూతలూగించిన వీడియో వైరలవుతోంది.