మన్మథుడు నాగార్జునపై ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయనతో ప్రతి ఉమెన్ ఇప్పటికీ రొమాన్స్ చేయాలనుకుంటారని చెబుతూ షాకిచ్చింది ఖుష్బూ. కింగ్ నాగార్జునకి ఇప్పుడు 65ఏళ్లు. కానీ ఇప్పటికీ ముప్పై ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తాడు. అదే ఎనర్జీ, అదే యాక్టివ్నెస్, అదే అందం, అదే స్టయిల్. ముప్పై ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో, ఇప్పుడు అలానే ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడే మరింత స్టయిల్ గా, యంగ్‌గా కనిపిస్తుంటారు. `బిగ్ బాస్` షోలో ఆయన స్టయిలీష్ లుక్‌కి అంతా ఫిదా అవ్వాల్సిందే. అంతగా తన ఫిట్‌నెస్‌ని మెయింటేన్ చేస్తూ వస్తున్నాడు. నాగార్జునకి మన్మథుడు అనే ట్యాగ్ ఉంది. ఆ పేరుకి మరింత న్యాయం చేస్తున్నాడు. ఈ ఏజ్‌లోనూ మన్మథుడిగానే కనిపిస్తున్నారు. ఇప్పటికీ నాగ్ని చూస్తుంటే అమ్మాయిలు ఫిదా అయిపోతారట. ఆయనతో ప్రేమలో పడిపోతారట, ఆయనతో డేట్‌కి వెళ్లాలని, రొమాన్స్ కూడా చేయాలనుకుంటారట. ఈ సంచలన వ్యాఖ్యలు సీనియర్ హీరోయిన్ ఖుష్బూ చేయడం విశేషం. ప్రతి అమ్మాయి ఇప్పటికీ నాగ్‌తో రొమాన్స్ చేయాలనుకుంటారని చెప్పి షాకిచ్చింది ఖుష్బూ. ఓ ఇంటర్వ్యూలో నాగార్జున గురించి చెప్పాల్సిన రావడంతో ఆమె చెబుతూ, నాగ్ ఎప్పటికీ మన్మథుడే అని, ప్రతి ఒక్క అమ్మాయి నాగ్‌తో రొమాన్స్ చేయాలనుకుంటుందని చెప్పి షాకిచ్చింది. ఆయన చాలా స్టయిలీష్ యాక్టర్ అని చెప్పిన ఖుష్బూ, తాను 1986లో `కెప్టెన్ నాగార్జున` చేసినప్పుడు కార్గో పాయింట్ వేసి అప్పుడే చాలా స్టయిలీష్‌గా ఉండేవాడని, ప్రారంభం నుంచి ఆయన అలానే ఉండేవాడని చెప్పింది ఖుష్బూ. అంతేకాదు ఈ సందర్భంగా మరో రహస్యాన్ని బయటపెట్టింది. ప్రతి ఒక్క ఉమెన్ ఆయనతో డేట్‌కి వెళ్లాలనుకుంటుందని, ఆయనతో లవ్‌లో పడిపోతుందని చెప్పింది. ఇటీవల ఖుష్బూ ఫ్రెండ్ నాగ్ని కలిశారట. ఆమె ఖుష్బూకి నాగ్ ఫోటో పంపించి `ఓ మై గాడ్, ఈయనతో నేను ప్రేమలో పడిపోయాను` అని చెప్పిందట. దీంతో నాగ్‌కి ఖుష్బూ.. నాగ్ ఇప్పటికీ నీకు అమ్మాయిల ఫాలోయింగ్ ఉంది. నీతో ప్రేమలో పడిపోతున్నారంటూ మెసేజ్ చేసిందట ఖుష్బూ. టీవీ5కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖుష్బూ ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa