సినీ నటుడు సుమన్ తాజాగా అయోధ్య రామ మందిరాన్ని సందర్శించారు. బాల రాముడి దర్శనం అనంతరం ఆయన అక్కడి మీడియాతో మాట్లాడారు. దేవాలయంలోని శిల్పకళ అద్భుతంగా ఉందని చెప్పారు. ‘‘బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ తరువాత తొలిసారి నేను ఇక్కడికి వచ్చాను. స్వామి వారి దర్శనం కోసం మళ్లీ ఇప్పుడు రావడం ఆనందంగా ఉంది. మందిరం ఆర్కిటెక్చర్, డిజైన్ అద్భుతంగా ఉన్నాయి. బాల రాముడి ప్రతిమను చూసి మంత్రముగ్ధుడిని అయ్యా’’ అని ఆయన అన్నారు.