ఉలగనాయగన్ కమల్ హాసన్ మరియు స్టార్ దర్శకుడు మణిరత్నం దాదాపు 17 సంవత్సరాల తర్వాత కలిసి ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'థగ్ లైఫ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా షూటింగ్ 25 రోజులలో పూర్తి అవుతుందని సమాచారం. ఆగష్టు తొలి వారంలో ఈ సినిమా షూటింగ్ ని మూవీ మేకర్స్ పూర్తి చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు లేటెస్ట్ టాక్. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో త్రిష, అలీ ఫజల్, సన్యా మల్హోత్రా, పంకజ్ త్రిపాఠి, ఐశ్వర్య లక్ష్మి, నాజర్, శింబు మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ మరియు మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్, మరియు శివ అనంతి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రతిభావంతులైన ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.