హీరో సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ మెహ్రీన్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా దీనిపై సాయి ధరమ్ తేజ్ టీమ్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. “అవన్నీ అబద్దాలే. హీరోయిన్ తో వస్తున్న పెళ్లి వార్తలన్నింటిలో వాస్తవం లేదు. ఆయన పెళ్లి గురించి ఏదైనా విషయం ఉంటే అధికారికంగా ప్రకటిస్తాము. కానీ అబద్ధాలను ప్రచారం చేయకండి " అని తెలిపారు.