ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐశ్వర్యరాయ్ ఎన్ని వందల కోట్లు సంపాదించారో తెలుసా

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2024, 02:07 PM

ఇండియన్ సినిమా పరిశ్రమలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ విడాకుల వ్యవహారం అత్యంత చర్చనీయాంశంగా మారింది.వారిద్దరి వేర్వేరుగా ఉంటున్నారంటూ వార్తలు ఊపందుకోవడంతో వారి కాపురంపై ఊహగానాలు జోరందుకొన్నాయి.ఈ క్రమంలో ఆమె సంపాదన, నికర ఆస్తుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో ఆమె రెమ్యునరేషన్, ఇతర వివరాల్లోకి వెళితే..ప్రపంచంలోనే అత్యంత అందగత్తెల్లో ఒకరైన ఐశ్వర్యరాయ్ వైవాహిక జీవితం సందిగ్దంలో పడిందనే వార్తలు భారీగా ప్రచారంలో ఉన్నాయి. కాపురంలో విభేదాలు చోటు చేసుకోవడం.. అవి పరిష్కరించుకోలేనంతగా మారడంతో అభిషేక్, ఐశ్వర్య విడిపోవాలని నిర్ణయం తీసుకొన్నారనే విషయం సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నదివిడాకుల విషయం పక్కన పెడితే.. ఐశ్వర్యరాయ్ కొంత మేరకు ప్రొఫెషన్స్‌కు దూరంగా ఉంటూ వస్తున్నది. కేవలం ఆచీతూచి సినిమాలను ఎంపిక చేసుకొంటున్నారు. ఇటీవల తమిళంలో మణిరత్నం సినిమా పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత ఆమె సినిమాలు అంగీకరించిన దాఖలాలు కనిపించడం లేదు.


అయితే ప్రస్తుతం ఐశ్వర్య రాయ్‌కు సినిమా రంగంలో డిమాండ్‌కు కొదవేమీ లేదు. ఆమె ఒక్కో సినిమాకు భారీగా రెమ్యునరేషన్ తీసుకొంటున్నారు. గత చిత్రం పొన్నియన్ సెల్వన్ సినిమాకు సుమారుగా 10 కోట్ల రూపాయల పారితోషికం తీసుకొన్నారు అని సినీ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ సినిమాలు చేయాలని నిర్ణయించుకొంటే.. ఆమె భారీగా ఆఫర్లు వచ్చిపడుతాయని అంటున్నారు.ఇక వ్యాపార ప్రకటనల రంగంలో కూడా ఐశ్వర్య రాయ్‌కి మంచి డిమాండ్ ఉంది. ఒక్కో బ్రాండ్‌కు భారీగా పారితోషికాన్ని తీసుకొంటున్నారు. ఒక్కో బ్రాండ్ ప్రమోషన్స్‌కు సుమారుగా 5 కోట్ల నుంచి 8 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకొంటున్నట్టు ట్రేడ్ రిపోర్టు.బాలీవుడ్ ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. ఐశ్వర్య రాయ్ వ్యక్తిగతంగా భారీ ఆస్తులు ఉన్నాయి. ఆమె పేరుపై కోట్లాది రూపాయలు ఆస్తులు రిజిస్టర్ అయ్యాయి. తాజా సమాచారం ప్రకారం.. ఆస్తుల విలువ 850 కోట్ల రూపాయలు. ప్రస్తుతం హీరొయిన్లలో అధికంగా ఆస్తులు ఉన్న వారిలో ఐశ్వర్య రాయ్ ఒకరని పేర్కొంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com