దర్శకుడు కె విజయ భాస్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కొంత విరామం తర్వాత ఈ స్టార్ డైరెక్టర్ తన కుమారుడు శ్రీ కమల్‌ని 'ఉషా పరిణయం' అనే కొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో పరిచయం చేస్తున్నాడు. 'లవ్ ఈజ్ బ్యూటిఫుల్' అనేది సినిమా క్యాప్షన్. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ ని ఘల్లు ఘల్లు అనే టైటిల్ తో లిరికల్ వీడియోని విడుదల చేసారు. ఈ సినిమా ఆగష్టు 2, 2024న విడుదల కానుంది. ఈ చిత్రంలో తన్వి ఆకాంక్ష కథానాయికగా నటిస్తుంది. వెన్నెల కిషోర్, శివాజీరాజా, ఆమని, సుధ, ఆనంద్ చక్రపాణి, రజిత, బాలకృష్ణ, సూర్య, మధుమణి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.