దర్శకుడు పా రంజిత్‌తో స్టార్ హీరో విక్రమ్ తన తదుపరి సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాకి తంగలన్ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా ఆగష్టు 15, 2024న విడుదల కానుంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ మరియు పార్వతి తిరువోతు కథానాయికలుగా నటిస్తున్నారు. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ ని క్లియర్ చేసుకొని U/A సర్టిఫికెట్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో డేనియల్ కాల్టాగిరోన్, పశుపతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది.