జాన్ అబ్రహం మరియు తమన్నా భాటియా ప్రధా పాత్రలలో నటించిన 'వేదా' చిత్రానికి నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు 15, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ ని క్లియర్ చేసుకొని U/A సర్టిఫికెట్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో శర్వరి, ఆశిష్ విద్యార్థి మరియు అభిషేక్ బెనర్జీ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, ఎమ్మే ఎంటర్‌టైన్‌మెంట్ మరియు JA ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తుంది.