బాబీ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుపుకుంటుంది. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్లు తమ తమ పాత్రల షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ చిత్రంలో ఊర్వశి రౌటేలా, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, చాందిని చౌదరి, రిషి కీలక పాత్రలలో నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa