సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రజలందరూ కేంద్రంలో మరోసారి బీజేపీకి పట్టం కట్టారు. దీనితో నరేంద్ర మోదీ రెండోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రు, ఇందిరా గాంధీ తర్వాత కాంగ్రెసేతర ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి పూర్తి మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించారు. కాగా మరికొన్ని గంటల్లో నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ దేశాల నుంచి అధినేతలు విచ్చేయనున్నారు. ప్రధానంగా సినీ రంగానికి సంబంధించి పలువురు అగ్ర నటీనటులు ఈ కార్యక్రమానికి రానున్నారు.
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్‌హాసన్‌కు ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆహ్వానాలు అందాయి. టాలీవుడ్ నుంచి కేవలం హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కి మాత్రమే ఆహ్వానం అందినట్లు తెలుస్తుంది. మరోవైపు బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, వివేక్ ఓబెరాయ్, కంగనా రనౌత్, ప్రముఖ దర్శకులు కరణ్ జోహార్, సంజయ్ లీలా భన్సాలీలు మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్నారు. అయితే కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్‌వుడ్ నుంచి సెలెబ్రిటీస్ ఎవరికి ఆహ్వానాలు అందినట్లు కనిపించటం లేదు.
Dear sir @narendramodi @PMOIndia @rashtrapatibhvn thank you so much for your kind invite. Feeling privileged and honoured upon receiving this, would have loved to witness history in the making! pic.twitter.com/NIf76QPCGw
— Kajal Aggarwal (@MsKajalAggarwal) May 30, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa