వెంకీ అట్లూరి దర్శకత్వంలో మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన రాబోయే చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'లక్కీ బాస్కర్' అనే టైటిల్ ని లాక్ చేసారు. సెప్టెంబర్ 7, 2024న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉన్న ఈ చిత్రం ఇప్పుడు మరో రోడ్‌బ్లాక్‌ను తాకింది. అంతకుముందు, బాక్స్ఆఫీస్ క్లాష్‌ను నివారించడానికి అసలు విడుదల తేదీ నుండి సెప్టెంబర్ 7, 2024కి మార్చబడింది. అయితే, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఇప్పుడు నిరవధికంగా వాయిదా పడింది. కొత్త విడుదల తేదీ అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ బహుభాషా చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది.ఈ చిత్రంలో సాయికుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కొన్ని నెలల క్రితం విడుదలైన టీజర్ మరియు పాటలకు మంచి స్పందన లభించడంతో లక్కీ బాస్కర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.