ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మెకానిక్ రాకీ' కి డబ్బింగ్ చెప్పడం ప్రారంభించిన విశ్వేక్ సేన్

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 19, 2024, 05:58 PM

టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'మెకానిక్ రాకీ' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి జోడిగా నటిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్ మరియు రోడీస్ రఘు రామ్ వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ కూడా కీలక పాత్రలో నటించారు. తాజాగా నటుడు విశ్వేక్ సేన్ ఈ సినిమాలోని తన పాత్రకి డబ్బింగ్ చెప్పడం ప్రారంభించినట్లు సోషల్ మీడియాలో డబ్బింగ్ స్టూడియో నుండి పిక్ ని పోస్ట్ చేసి ప్రకటించారు. ఈ చిత్రం అక్టోబరు 31, 2024న భారీ ఎత్తున విడుదలకు సిద్ధంగా ఉంది. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌పై రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం, ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ద్వారా దేశవ్యాప్తంగా విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com