వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని ఒక సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'సరిపోద శనివారం' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా ట్రైలర్ ఈ మూవీ పై భారీ అంచనాలని నెలకొల్పింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రొమోషన్స్ ని ప్రారంభించారు. అందులో భాగంగా ఇటీవలే చిత్ర బృందం ప్రమోషన్స్ కి చెన్నై కి వెళ్ళింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ సరిపోదా శనివారం టీమ్ పాల్గొన సోకులపాలెం స్పెషల్ ఇంటర్వ్యూ ని విడుదల చేసినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త వీడియోని విడుదల చేసింది. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 29, 2024న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో సాయికుమార్, అభిరామి, మురళి శర్మ, అజయ్, హర్షవర్ధన్, సుధాకర్, సుప్రీత్ రెడ్డి, అదితి బాలన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ యాక్షన్ డ్రామాకు జేక్ బెజోయ్ సంగీత దర్శకుడు.