గతేడాది ‘జైలర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ స్టార్ రజినీ కాంత్ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే ‘జైం భీమ్’తో హిట్ అందుకున్న టీజే జ్ఞానవేల్‌తో ‘వేట్టయాన్’ అనే సినిమాను విడుదలకు రెడీ చేసిన తలైవర్ ఈ చిత్రం అనంతరం లోకేష్ కనగరాజ్‌తో ‘కూలీ’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాల అనంతరం మరో క్రేజీ దర్శకుడితో రజినీ చేతులు కలపబోతున్నాడు.పరియేరుమ్ పెరుమాళ్’, ‘కర్ణన్’, ‘మామన్నన్ ‘ సినిమాలతో హిట్లు అందుకున్న దర్శకుడు మారి సెల్వరాజ్‌తో రజినీ తన తదుపరి చిత్రం చేయబోతున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. అయితే దీని గురించి దర్శకుడు మారి సెల్వరాజ్ మాట్లాడుతూ.. రజనీ కాంత్‌కు నేను అంటే ఇష్టం. అతడు నా గత సినిమాలు చూశాడు. ఆ తర్వాత ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందించారు. త్వరలో మేమిద్దరం కలిసి ఓ చిత్రం చేయాలని అనుకుంటున్నాం. ప్రస్తుతానికైతే కథా చర్చలు జరుగుతున్నాయి అంటూ తెలిపాడు మారి. కాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన రావడానికి మరిన్ని రోజులు పట్టేలా ఉంది. మారి సెల్వరాజ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం వాలై(vaazhai) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్‌ను అందుకున్నాడు. ఈ చిత్రం నేడు విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.