మాస్ మహారాజ రవితేజకు సర్జరీ జరిగింది. ఇటీవల ఓ సినిమా చిత్రీకరణ సమయంలో అతడు స్వల్పంగా గాయపడ్డాడు. కుడిచేతికి గాయమైనప్పటికీ లెక్క చేయకుండా షూట్ కొనసాగించాడు. దురదృష్టవశాత్తూ నొప్పి తీవ్రతరం కావడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు.అతడిని పరీక్షించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయాలని సూచించారు. అనంతరం విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు. హీరో రవితేజను ఆరువారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa