ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెజాన్ లో విజయ్ ఆంటోనీ "తుఫాన్" చిత్రం

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 23, 2024, 06:51 PM

తమిళ ప్రముఖ నటుడు అంతే కాకుండా సంగీత దర్శకుడు అయినటువంటి విజయ్ ఆంటోనీ ఇప్పుడు హీరోగానే పలు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాదిలో ఈ తమిళ నటుడు నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఇక వాటిలో లేటెస్ట్ సినిమానే 'తూఫాన్'. దర్శకుడు విజయ్ మిల్టన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటించింది. కాగా రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఈ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ లోకి వచ్చేసింది. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ఓటీటీలో విడుదల కావడంతో మరింత మంది ప్రేక్షకులు


ఈ సినిమాను ఆస్వాదించే అవకాశం ఉంది. విజయ్ తన అద్భుతమైన నటనతో ఈ సినిమాకు మరింత బలం చేకూర్చాడు. ఈ సినిమా కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది అని చెప్పవచ్చు. "తుఫాన్" సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. ఈ సినిమా యొక్క కథ, నటీనటుల నటన, సంగీతం అన్నీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇది ఇలా ఉంటే తమిళ్ లో గత వారమే అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఇక ఇది విన్న అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా హక్కులు ప్రముఖ సంస్థ అమెజాన్


ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా ఇప్పుడు ఇందులోనే తెలుగులో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి విజయ్ ఆంటోనీ సినిమాలు చూడాలి అనుకునేవారు అయితే ఈ చిత్రాన్ని ఇందులో చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి అచ్చు, విజయ్ ఆంటోనీలు సంగీతం అందించగా ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ వారు నిర్మాణం వహించారు. కాగా ఇందులో విజయ్ పాటు మిగతా నటవర్గం కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు అని చెప్పాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa