ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగులో 'అమరన్‌' ను విడుదల చేయనున్న నితిన్

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 24, 2024, 02:59 PM

కోలీవుడ్ స్టార్ నటుడు శివ కార్తికేయన్‌ తన తదుపరి ప్రాజెక్ట్ ని రాజ్‌కుమార్ పెరియసామితో చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'అమరన్‌' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. ఈ బహుభాషా బయోగ్రాఫికల్ యాక్షన్ చిత్రం అమరన్ దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను శ్రేష్ఠ్ మూవీస్ పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. చిత్ర సాంకేతిక బృందంలో G V ప్రకాష్, రాజీవ్, CH సాయి, R. కలైవానన్, అన్బరివ్ మాస్టర్స్ మరియు స్టీఫన్ రిక్టర్ వంటి ప్రఖ్యాత పేర్లు ఉన్నాయి. శివ్ అరూర్ మరియు రాహుల్ సింగ్ రచించిన "ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్" పుస్తకం ఆధారంగా యాక్షన్-ప్యాక్డ్ బయోగ్రాఫికల్ డ్రామా 'అమరన్' రూపొందుతుంది. భారీ బడ్జెట్ మరియు అత్యున్నత సాంకేతిక బృందంతో ఈ చిత్రం విజువల్ ట్రీట్‌గా ఉంటుందని భావిస్తున్నారు. శివకార్తికేయన్ యొక్క మునుపెన్నడూ చూడని అవతార్ పై మరియు సాయి పల్లవి నటనపై చాలా అంచనాలు ఉన్నాయి. సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సహకారంతో రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa