ఇటీవల కాలం లో ప్రముఖ యంగ్ హీరో రాజ్ తరుణ్ మీడియా లో ఎంత సెన్సేషనల్ టాపిక్ అయ్యాడో మన అందరికీ తెలిసిందే. ఈ వివాదం జరుగుతున్న సమయంలో రాజ్ తరుణ్ కి సంబంధించి ‘పురుషోత్తముడు’, ‘తిరగబడ్డారు సామీ’ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలు కూడా డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. కనీసం ప్రొమోషన్స్ కోసం ఖర్చు చేసిన డబ్బులను కూడా రాబట్టలేకపోయాయి. ఇప్పుడు రాజ్ తరుణ్ హీరో గా నటించిన మరో కొత్త చిత్రం ‘భలే ఉన్నాడే’ వచ్చే నెల 7 వ తారీఖున విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఆయన ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. అందులో భాగంగా రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి, ఇది ఎంత వరకు నిజం అని అడగగా, దానికి రాజ్ తరుణ్ సమాధానం చెప్తూ ‘ఇప్పటి వరకు నా మెడకు చుట్టుకున్న నెగటివిటీ, కాంట్రవర్సీలు చాలు. నాకు బిగ్ బాస్ అసలు సూట్ అవ్వదు, నేను అక్కడ ఒక్క రోజు కూడా ఉండలేను’ అంటూ చెప్పుకొచ్చాడు. గతం లో ఇలాంటి వివాదాల్లో చిక్కుకొని నా సినిమాలను సరిగా ప్రమోట్ చేయలేకపోయానని, ఇక నుండి నా పూర్తి ద్రుష్టి సినిమాల మీదనే ఉంటుందని రాజ్ తరుణ్ వ్యాఖ్యానించాడు.