విజయ్ దళపతి హీరోగా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న చిత్రం 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (ది గోట్). సెప్టెంబరు 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇటీవల సెన్సార్ బోర్డు ముందుకెళ్లింది ఈ మూవీ . చిత్ర బృందానికి కొన్ని మార్పులు సూచించిన బోర్డు. మరోసారి సెన్సార్ చేసింది. యూ/ఏ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా ఫైనల్ రన్‌టైమ్ 3:03 గంటలు (ఫన్ బ్లూపర్స్తో కలిపి). ఇంతకుముందు 2: 59 గంటలు. లేటెస్ట్ సెన్సార్ రిపోర్టు 'ఎక్స్'లో చక్కర్లు కొడుతున్నాయి. సెన్సార్ బోర్డు ఆదేశించిన మేరకు.. ఓ లేడీ క్యారెక్టర్‌కు సంబంధించిన రియాక్షన్ షాట్‌ను తొలగించిన 'ది గోట్' టీమ్.. రెండు సెకన్ల నిడివి ఉన్న షాట్‌ను మరో షాట్‌తో భర్తీ చేసింది.సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి 'డీ-ఏజింగ్' టెక్నాలజీ వినియోగించారు. దీని సాయంతో విజయ్‌ని పాతికేళ్ల కుర్రాడిగా చూపించనున్నారు. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేశారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్. స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా కీలక పాత్రలు పోషించారు. కోలివుడ్ చరిత్రలోనే భారీ స్థాయిలో (తమిళనాడులో ఉన్న దాదాపు అన్ని థియేటర్లలో) ఈ సినిమా విడుదల కానుంది. తెలుగు ప్రేక్షకులనూ అలరించేందుకు సిద్ధంగా ఉంది. తమిళనాడులో సెప్టెంబరు 5న ఉదయం 4 గంటలకే ప్రదర్శన మొదలవుతుందని సమాచారం.