ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈనెల 30న విడుదలవుతున్న "నేను కీర్తన" చిత్రం

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 28, 2024, 04:24 PM

యువ ప్రతిభాశాలి 'బన్నీ అశ్వంత్'ను దర్శకుడు గా పరిచయం చేస్తూ... శ్రీ జగన్మాత రేణుక క్రియేషన్స్ పతాకంపై శ్రీధర్ సామా - వెంకట్ గౌడ్ పంజాల సంయుక్తంగా ప్రొడక్షన్ నంబర్ 1గా నిర్మిస్తున్న చిత్రం టైటిల్ ప్రకటన మరియు లోగో విడుదల కార్యక్రమం హైదరాబాద్ లోని, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రివ్యూ థియేటర్ లో అత్యంత కోలాహలంగా జరిగింది.చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు ("సి.హెచ్.ఆర్")ను దర్శకుడిగా పరిచయం చేస్తూ...చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) - రిషిత - మేఘన హీరోహీరోయిన్లుగా... చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన "నేను-కీర్తన" అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కమ్ కథానాయకుడు రమేష్ బాబు, చిత్ర కథానాయకి రిషిత మీడియాతో ముచ్చటించారు!!


ముందుగా చిత్ర కథానాయకుడు రమేష్ బాబు మాట్లాడుతూ... "నేను - కీర్తన" కథను ఆరు నెలల పాటు శ్రమించి సిద్ధం చేశాను. ఈ కథకు దర్శకుడిగా, హీరోగా నేనయితేనే పూర్తి న్యాయం చేయగలనిపించింది. నా నిర్ణయాన్ని అమెరికాలో ఉంటున్న మా సోదరి సమర్ధించి, అన్ని విధాలా సహాయసహకారాలు అందించింది. దర్శకుడుగాను, హీరోగానూ నాకు చాలా మంచి పేరు తెస్తుందనే నమ్మకం నాకుంది. ఈనెల 30న విడుదలవుతున్న "నేను కీర్తన" ఘన విజయం సాధిస్తుందనడంలో సందేహాలకు తావులేదు. ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అవుతున్న రిషితకు ఉజ్వలమైన భవిష్యత్ ఉంది. అలాగే సెకండ్ హీరోయిన్ మేఘన, స్పెషల్ సాంగ్ చేసిన రేణు ప్రియలకు కూడా ఈ చిత్రం మంచి పేరు తెస్తుంది. కులుమనాలిలో చిత్రీకరించిన పాటలతోపాటు... ఆరు రోప్ ఫైట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. రెండున్నర గంటలపాటు నాన్ స్టాప్ ఎంటర్టైన్ చేసే మల్టీ జోనర్ ఫిల్మ్ ఇది. ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అన్నారు!!


చిత్ర కథానాయకి రిషిత మాట్లాడుతూ... "నేను - కీర్తన"లో హీరోయిన్ గా ఎంపికై, ఈ సినిమా చాలా బాగా వస్తుందన్న విషయం బయటకు పొక్కి... ఇందులో నటిస్తుండగానే మరో ఐదు సినిమాలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. హీరో కమ్ డైరెక్టర్ రమేష్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. హీరోయిన్లుగా తెలుగమ్మాయిలకు మన ఇండస్ట్రీలో చోటు లేదనే వాదనను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాను. ప్రతిభ ఉండి పట్టుదలతో ప్రయత్నిస్తే తెలుగమ్మాయిలు కూడా హీరోయిన్లుగా రాణించవచ్చు. ప్రతిభను ప్రోత్సహించడంలో మన తెలుగువారు ఎప్పుడూ ముందుంటారు. నేను కీర్తన చిత్రం హీరోయిన్ గా నా కెరీర్ కి శుభారంభం ఇస్తుందనే నమ్మకం నాకు ఉంది" అన్నారు!!


 


రేణు ప్రియ, సంధ్య, జీవా, విజయరంగ రాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్, మంజునాథ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, డి.ఐ: భాను ప్రకాష్, వి.ఎఫ్.ఎక్స్: నవీన్, ఎస్.ఎఫ్.ఎక్స్: ఎ. నవీన్ రెడ్డి, పోరాటాలు: నూనె దేవరాజ్, నృత్యాలు: అమిత్ కుమార్ - సి.హెచ్.ఆర్, పాటలు: సి.హెచ్.ఆర్ - అంచుల నాగేశ్వరరావు - శ్రీరాములు, సంగీతం: ఎం.ఎల్.రాజా, ఛాయాగ్రహణం: కె. రమణ, కూర్పు: వినయ్ రెడ్డి బండారపు, సమర్పణ: చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ), నిర్మాత: చిమటా లక్ష్మికుమారి, రచన - దర్శకత్వం: చిమటా రమేష్ బాబు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com