కానీ కృతి శెట్టి ఆ తర్వాత నటించిన చిత్రాలన్నీ తీవ్రంగా నిరాశపరిచాయి. బంగార్రాజు మాత్రం పర్వాలేదనిపించింది. శ్యామ్ సింగ రాయ్, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. చివరగా నటించిన మనమే చిత్రం కూడానా ఫ్లాప్. దీనితో కృతి శెట్టికి ప్రస్తుతం టాలీవుడ్ లో సరైన ఆఫర్లు లేవు. వరుస ఫ్లాపులే అందుకు కారణం. అయితే పరాజయాలపై కృతి శెట్టి తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. నా సినిమాలు ఫ్లాప్ అయితే సంతోషించడానికి ఎప్పుడూ ఒక బ్యాచ్ ఎదురుచూస్తూ ఉంటుంది. వాళ్ళకి నా ఎదుగుదల ఇష్టం లేదు. అయితే ఆ బ్యాచ్ ఎవరనేది కృతి శెట్టి బయట పెట్టలేదు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నేను సక్సెస్ ని, ఫెయిల్యూర్ ని ఒకేలా తీసుకుంటా. ఉప్పెన సక్సెస్ అయినప్పుడు మొత్తం నా వల్లే అనే క్రెడిట్ తీసుకోలేదు. అదే విధంగా సినిమా ఫ్లాప్ ఐతే కూడా నేను కారణం కాదు. కానీ పరాజయాల నుంచి ఎక్కువ నేర్చుకున్నాను. బాగా స్ట్రాంగ్ అయ్యాను అని తెలిపింది. నేను విమర్శలకు తట్టుకుని నిలబడగలిగే స్థాయిలో ఉన్నాను. నా ఫెయిల్యూర్ చూసి ఆనందించే వారిని అసలు పట్టించుకోను అంటూ కృతి శెట్టి సంచలన వ్యాఖ్యలు చేసింది. కృతి శెట్టి పట్ల అంతగా ద్వేషం చూపించేది ఎవరబ్బా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.