ప్రస్తుతం కోలీవుడ్ సినిమా దగ్గర భారీ అంచనాలు సెట్ చేసుకున్న చిత్రాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ లా కాంబినేషన్ లో చేస్తున్న భారీ చిత్రం “కూలీ” కూడా ఒకటి. మరి అనౌన్స్మెంట్ నాటి నుంచి మంచి బజ్ ని సెట్ చేసుకున్న ఈ సినిమాలో లోకేష్ కనగరాజ్ మార్క్ క్యాస్టింగ్ అయితే ఇప్పుడు కనిపిస్తుంది.
కోలీవుడ్ నుంచి తలైవర్ మొన్ననే మళయాళ సినిమా నుంచి టాలెంటెడ్ నటుడు సౌబిన్ సాహిర్ ను దయాల్ అంటూ పరిచయం చేయగా నిన్ననే కింగ్ నాగార్జున ని సైమన్ అంటూ పరిచయం చేశారు. దీనితో ఒక్కసారిగా కూలీపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా అనౌన్స్ చేసిన సమయంలో ‘డిస్కో’ అనే పదాన్ని హైలైట్ చేసారు.ఇప్పుడు ఆంగ్లంలో ఆ పదానికి సంబంధించే ఒకో అక్షరం తాలూకా పాత్రదారుణ్ని రివీల్ చేస్తున్నారు అంటూ గతంలో లియో తరహాలో ఒక థియరీ వైరల్ అవుతుంది. ఇలా డిస్కో లో ఎస్ తో మొదలయ్యే సైమన్, డి తో మొదలయ్యే దయాల్ లు పరిచయం అయ్యారు, ఇంకో ముగ్గురు పరిచయం కావాల్సి ఉందని అంటున్నారు. మరి నిజగామే క్యాస్టింగ్ ఇలా జరుగుతుందా లేదా అనేది మరో అప్డేట్ వస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు
Introducing @iamnagarjuna as Simon, from the world of #Coolie
Wishing the versatile performer King Nagarjuna a Happy Birthday!@rajinikanth @Dir_Lokesh @anirudhofficial @anbariv pic.twitter.com/AvI6qmUMnT
— Sun Pictures (@sunpictures) August 29, 2024
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa