ఫస్టు షెడ్యూల్ షూటింగును పూర్తి చేసుకుంది ‘డిస్కోరాజా’. ఈ చిత్రంలో మాస్ మహారాజ్ రవితేజ.. పాయల్ రాజ్‌పుత్-నభానటేశ్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వీఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం రెండవ షెడ్యూల్లో భాగంగా కొన్ని రోజులుగా రామోజీ ఫిల్మ్ సిటీలో రవితేజ – వెన్నెల కిషోర్ కాంబినేషన్‌లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ రోజు .. రేపు వికారాబాద్ లో షూటింగును ప్లాన్ చేశారు. కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. రామ్ తాళ్లూరి నిర్మిస్తోన్న ఈ సినిమాలో మరో కథానాయికకు కూడా చోటు వున్నట్టు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa