నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ వేడుకను నిర్వహించిన సంగతి తెలిసిందే. అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఈవెంట్ లో యావత్ తెలుగు సిని ఇండస్ట్రీ, రాజకీయ ప్రముఖులు సందడి చేసారు. తమ అభిమాన హీరోలంతా ఒకే చోట కనపడటం చూసి ఫ్యాన్స్ పులకించిపోయారు. ఈ నేపధ్యంలో చిరంజీవి ఇచ్చిన స్పీచ్ అంతటా వైరల్ గా మారింది. బాలకృష్ణ నట జీవితం, ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.చిరంజీవి మాట్లాడుతూ... తాను ‘ఇంద్ర’ మూవీ చేయడానికి బాలకృష్ణ ‘సమరసింహారెడ్డి’ ఆదర్శమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. బాలకృష్ణతో కలిసి ఒక ఫ్యాక్షన్ మూవీ చేయాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టారు.
చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘ బాలయ్యబాబు 50 సంవత్సరాల వేడుకలో పాలు పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది బాలకృష్ణకు మాత్రమే కాదు, తెలుగు చలన చిత్రానికి ఒక వేడుక. అరుదైన రికార్డు బాలయ్య సొంతం చేసుకున్నందుకు సంతోషం. ఎన్టీఆర్కు ప్రజల మదిలో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కుమారుడిగా బాలకృష్ణ తండ్రి చేసిన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించడం మామూలు విషయం కాదు. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన తన ప్రత్యేకత చాటుకున్నారు’’
అలాగే ‘‘ఫ్యాన్స్ గొడవలు పడుతుంటారు. హీరోల మధ్య ఎటువంటి మంచి బంధం ఉంటుందో తెలియడం కోసం కొన్ని వేడుకలు చేసుకునేవాళ్లం. అందుకే మా అభిమానులు కూడా కలిసి కట్టుగా ఉంటారు. మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా బాలయ్య వస్తారు. మాతో కలిసి డ్యాన్స్ కూడా చేస్తారు. 50 సంవత్సరాల ఈ ప్రయాణం ఇంకా హీరోగా నటించే ఘనత బాలయ్యకే సొంతం.