ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ‌నివాసుడితో మ‌హాన‌టి..!

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 04, 2019, 07:37 PM

యంగ్ హీరో నితిన్ వరుసపెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ప్రస్తుతం వెంకీ కుడుముల డైరెక్షన్‌లో ‘భీష్మ’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడట నితిన్. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైనట్లు వినికిడి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు చిత్ర యూనిట్.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa