మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ రిపోర్ట్ పెద్ద దుమారాన్నే రేపుతోంది. ఇతర ఇండస్ట్రీల నటీమణులు కూడా దీని పై స్పందిస్తున్నారు. తమ ఇండస్ట్రీలో కూడా హేమ కమిటీ తరహా కమిటీ ఉండాలని కోరుకుంటున్నారు.కాగా కొంతమంది సినీ తారలు తమకు ఎదురైనా చేదు అనుభవాలను దైర్యంగా మీడియా ముందు మాట్లాడుతున్నారు. తాజాగా ఇండస్ట్రీలో జరుగుతున్నా లైంగిక వేధింపుల గురించి క్రేజీ బ్యూటీ సన్నీలియోన్ మాట్లాడింది. శృంగార తారగా పేరుతెచ్చుకున్న ఈ అమ్మడు ఇప్పుడు ల్లో రాణిస్తోంది. బాలీవుడ్ లో సన్నీలియోన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తెలుగులోనూ ఈ అమ్మడు లు చేసింది. తెలుగులో సన్నీ స్పెషల్ సాంగ్స్ లో మెరిసింది. అలాగే కొన్ని ల్లోనూ నటించింది.
మంచు మనోజ్ హీరోగా నటించిన కరెంట్ తీగ లో గెస్ట్ రోల్ లో మెరిసింది. ఆతర్వాత మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా లో ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ప్రభుదేవాతో కలిసి ఓ చేస్తోంది. తాజాగా ఆ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న సన్నీ హేమ కమిటీ రిపోర్ట్ పై స్పందించింది. ల్లో తనకు ఎలాంటి చేదు అనుభవాలు లేవని సన్నీలియోన్ తెలిపింది. ఒక్క అవకాశం మిస్ అయితే మరో వంద అవకాశాలు వస్తాయి. ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే వద్దు అని చెప్పి వెళ్ళిపోతాను అని సన్నీ తెలిపింది.సన్నీలియోన్ తన అనుభవాన్ని మాత్రమే చెప్పగలను అని చెప్పింది. “ఇతరులతో పంచుకునేంత చేదు అనుభవాలు నాకు లేవు . నేను వ్యక్తిత్వం, వృత్తిని నమ్ముతాను. పారితోషికం ఎక్కువ అని నేను భావించినప్పుడు, నేను డిమాండ్ చేస్తా.. అందరూ అలాగే చేయాలన్నది నా అభిప్రాయం. సరైన నిర్ణయాలను ఎంచుకోండి. ఏదైనా తప్పు లేదా తప్పుడు ప్రవర్తన అని మీకు అనిపిస్తే, మీరు వద్దు అని చెప్పి వెళ్లిపోవాలి.దాంతో ఒక్క అవకాశం మిస్ అవ్వొచ్చు.. కానీ ఒక్క అవకాశం పోతే వందల కొద్దీ అవకాశాలు వస్తాయని తెలిపింది సన్నీ. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.