ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆర్ ఎక్స్ 100' లాగే ఈ సినిమా యూత్ కి కనెక్ట్ అవుతుంది : కార్తికేయ

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 06, 2019, 12:17 PM

కార్తికేయ కథానాయకుడిగా టీఎన్ కృష్ణ రూపొందించిన 'హిప్పీ' సినిమా, రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. దిగాంగన కథానాయికగా నటించిన ఈ సినిమాలో, జేడీ చక్రవర్తి ఒక కీలకమైన పాత్రను పోషించాడు.

తాజాగా హీరో కార్తికేయ మాట్లాడుతూ, " పూర్తిగా యూత్ ను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాను రూపొందించడం జరిగింది. 'ఆర్ ఎక్స్ 100' మాదిరిగానే ఈ సినిమా యూత్ కి కనెక్ట్ అవుతుందనే నమ్మకం వుంది. తెరపై డిఫరెంట్ లుక్స్ తో కనిపించడం .. డాన్సులు చేయడం .. ఫైట్స్ చేయడం నాకు చాలా ఇష్టం. అవన్నీ ఈ సినిమాలో వున్నాయి. ఈ సినిమా చేయడానికి ఇదో కారణం. మూడవ సినిమాతోనే నా కల నిజమైనందుకు నాకు చాలా సంతోషంగా వుంది. ఈ సినిమా చూస్తూ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు" అని చెప్పుకొచ్చాడు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa