"మా తాతయ్య అనారోగ్యంతో ఉన్నప్పుడు యాంటీబయోటిక్స్ వేసుకోకుండా, ఆహారం మానేసేవారు. అన్ని సమస్యలు కడుపు నుంచే పుడతాయి కాబట్టి దానికి కోలుకునే సమయం ఇవ్వాలనేవారు. అలా 101 ఏళ్లు జీవించారు," అని నటి ఛవి మిట్టల్ తాజాగా చెప్పారు. "స్వల్పకాలిక ఉపవాసం రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. దీర్ఘకాలిక ఉపవాసం అనేక సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి ఈ విధానం అందరికీ సరిపడదు" అని ఫోర్టిస్ హాస్పిటల్ డా. ప్రణవ్ అన్నారు.