బిగ్ బాస్ తెలుగు 8లో లేడి కంటెస్టెంట్ యష్మీ గౌడను వెనుక నుంచి వాటేసుకున్నాడు నాగ మణికంఠ. అది తనకు కంఫర్ట్‌గా లేదని, తనవల్ల కావట్లేదని, మెంటల్ టార్చర్ అని వెక్కి వెక్కి ఏడ్చింది యష్మీ గౌడ. బిగ్ బాస్ 8 తెలుగు సెప్టెంబర్ 17వ తేది ఎపిసోడ్ ప్రోమో చూస్తే..బిగ్ బాస్ తెలుగు 8 మూడో వారం నామినేషన్స్ కూడా రచ్చ రచ్చ గానే సాగాయి. థర్డ్ వీక్ నామినేషన్స్‌లో యష్మీని నాగ మణికంఠ నామినేట్ చేశాడు. దానికి యష్మీకి చాలా ఫీల్ అయింది. ఫ్రెండ్షిప్ పేరుతో మోసం చేశావని, తన హార్ట్ బ్రేక్ చేశావని మణికంఠతో అక్కడే చెప్పేసింది.
అంతేకాకుండా, మణికంఠను కూడా తిరిగి నామినేట్ చేసింది యష్మీ. ప్రతి వారం తనను నామినేట్ చేస్తానని చెప్పుకొచ్చింది కృష్ణముకుంద మురారి సీరియల్లో విలన్ ముకుంద పాత్రలో అలరించిన యష్మీ. అయితే, నామినేషన్స్ అనంతరం యశ్మీని కూల్ చేయడానికి ట్రై చేశాడు నాగ మణికంఠ. దీనికి సంబంధించి బిగ్ బాస్ 8 తెలుగు సెప్టెంబర్ 17వ తేది ఎపిసోడ్ ప్రోమోను తాజాగా వదిలారు.బిగ్ బాస్ తెలుగు 8 డే 16 ప్రోమోలో యష్మీని వెనుక నుంచి హగ్ చేసుకున్నాడు నాగ మణికంఠ. "అదంతా నామినేషన్ వరకే తీసుకో. ఇంకేం మార్చుకోవాల్సిన అవసరం లేదు" అన్నట్లుగా నాగ మణికంఠ హగ్ చేసుకుని యష్మీతో అన్నాడు. దానికి సరే వదిలేయ్ అని కాస్తా గట్టిగా బదులిచ్చింది యష్మీ. "చూడు సీరియస్‌గా చెబుతాది చూడి సరే.. వదిలేయ్ అని" అని నాగ మణికంఠ వెళ్లిపోయాడు.