మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరిటాన్ని రియా సింఘా దక్కించుకుంది. ఆదివారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2024 గ్రాండ్ ఫినాలేలో రియా సింఘా టైటిల్ సాధించారు. దీంతో గుజరాత్‌కు చెందిన 18 ఏళ్ల రియా సింఘా మెక్సికోలో జరిగే మిస్ యూనివర్స్ 2024లో భారత్ తరఫున పోటీ పడే అవకాశాన్ని దక్కించుకుంది. మిస్ యూనివర్స్ ఇండియా తనకు రావడంపై రియా ఆనందం వ్యక్తం చేశారు.
"ప్రతి ఒక్కరికీ నేను నిజంగా కృతజ్ఞతలు చెబుతున్నాను. నేను ఈ కిరీటానికి అర్హురాలినని భావించగలను" అని రియా సింఘా తెలిపారు. ఈ ఈవెంట్‌లో న్యాయనిర్ణేతగా నటి, మిస్ యూనివర్స్ ఇండియా 2015 ఊర్వశి రౌటేలా వ్యవహరించారు. ఊర్వశి రౌతేలా రియాను అభినందిస్తూ ప్రశంసలు కురిపించారు. ఈ సంవత్సరం భారతదేశం మళ్లీ మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుంటుందని ఊర్వశి రౌటేలా ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా ఫైనల్ చివరి రౌండ్ లో 10 మంది పోటీదారులు పోటీ పట్టారు. చివరి ప్రశ్న సమాధానం ఇచ్చి రియా న్యాయనిర్ణేతల హృదయాలను గెలుచుకున్నారు.