ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) 2025 అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్స్) కోసం భారతదేశ అధికారిక ఎంట్రీగా కిరణ్ రావు యొక్క "లాపటా లేడీస్"ని ఎంపిక చేసింది. విభిన్న శ్రేణి చిత్రాలను పరిగణించిన కఠినమైన ఎంపిక ప్రక్రియ తర్వాత ఈ చిత్రం విజయం సాధించింది. టాలీవుడ్ నుండి "కల్కి 2898 AD" "హను-మాన్" మరియు "మంగళవారం" వంటి ప్రముఖ పోటీదారులతో సహా దేశవ్యాప్తంగా విభిన్న శ్రేణి చిత్రాలను పరిగణించిన కఠినమైన ఎంపిక ప్రక్రియ తర్వాత ఈ చిత్రం విజయం సాధించింది. కిరణ్ రావు, అమీర్ ఖాన్ మరియు జ్యోతి దేశ్‌పాండే నిర్మించిన "లాపతా లేడీస్" నితాన్షి గోయెల్, స్పర్ష్ శ్రీవాస్తవ్ మరియు ప్రతిభా రంతా ప్రధాన పాత్రలలో నటించారు. అలాగే అనుభవజ్ఞులైన నటులు రవి కిషన్, ఛాయా కదమ్ మరియు అభయ్ దూబే సహాయక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం OTT విడుదలైనప్పటి నుండి విస్తృతమైన ప్రశంసలను పొందింది, ఇది భారతీయ మరియు అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకర్షించింది. దర్శకుడు కిరణ్‌రావు ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేశారు: "'లాపటా లేడీస్' ఆస్కార్‌కి చేరుకుంటే అది ఒక కల నిజమవుతుంది. ఇది ఒక ప్రయాణం, దానికి తగిన గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాను. అంతిమంగా, ఉత్తమ చిత్రం గెలుస్తుందని నేను నమ్ముతున్నాను అని అన్నారు. రామ్ సంపత్ ఉర్రూతలూగించే సంగీతం, వికాష్ నౌలాఖా అద్భుతమైన సినిమాటోగ్రఫీ, హృద్యమైన నటనతో "లాపతా లేడీస్" ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇప్పుడు, ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్ కోసం ఈ చిత్రం తన ప్రయాణాన్ని ప్రారంభించడంతో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.