యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని తలపిస్తున్నది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హీరో కల్యాణ్ రామ్ నిర్మించారు.జూ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం, సైఫ్ ఆలీ ఖాన్ విలన్‌గా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 27 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాలు ఎప్పటికప్పడు లైవ్ అప్‌డైట్స్‌గా మీ కోసం..
చెన్నైలో క్రేజీ రెస్పాన్స్
చెన్నైలో దేవరకు మంచి రెస్పాన్స్ దక్కుతున్నది. ఈ మూవీ తెలుగు వెర్షన్‌కు సంబంధించి 99 షోలు ప్రదర్శిస్తుండగా 76 షోలు హౌస్‌ఫుల్స్ అయ్యాయి. తమిళ వెర్షన్‌కు సంబంధించి 43 షోలు ప్రదర్శించగా.. 4 షోలు ఫుల్ అయ్యాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇండియాలో 38 కోట్ల రూపాయలు
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో దేవర చిత్రం సంచలనం క్రియేట్ చేస్తున్నది. తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 33 కోట్లు, కర్నాటక, ఇతర ప్రాంతాల్లో కలిపి మొత్తంగా 38 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేసింది.
వరల్డ్ వైడ్ 60 కోట్లు దాటేసి..
తాజా సమాచారం ప్రకారం.. విడుదలయ్యే ప్రతీ చోట సంచలన కలెక్షన్లను నమోదు చేస్తున్నది. ఈ సినిమా ఇప్పటికే 60 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇంకా 36 గంటల సమయం ఉంది కనుక సునాయాసంగా 100 కోట్లు దాటే అవకాశం ఉందంటున్నారు.
ఆస్ట్రేలియాలో సరికొత్త చరిత్ర
ఆస్ట్రేలియాలో కూడా ఈ సినిమా సరికొత్త చరిత్రను తిరగరాసింది. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా వసూలు చేయని విధంగా కలెక్షన్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో విడుదల చేసింది. దేవర సినిమాను సుమారుగా 1200 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇది ఇండియన్ సినిమాకు అరుదైన రికార్డుగా ట్రేడ్ వర్గాలు చెప్పుకొంటున్నాయి.
గుంటూరు జిల్లాలో ఆల్ టైమ్ రికార్డు
గుంటూరులో దేవర సినిమా ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాతొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఇప్పటికే 83 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. దాదాపు 44 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమా సుమారుగా 1.15 కోట్ల రూపాయలు అంటే కోటి 14 లక్షల రూపాయలు వసూలు చేసింది.
దేవర చిత్రం అడ్వాన్స్ బుకింగ్‌కు సగటు ప్రేక్షకుడి నుంచి భారీ స్పందన లభిస్తున్నది. ఈ సినిమా ఇప్పటికే 500000 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. రిలీజ్ రోజు నాటికి రికార్డు స్థాయిలో 1 మిలియన్ టికెట్లు అమ్ముడుపోతాయని ట్రేడ్ వర్గాల అంచనా. ఈ సినిమా ఇప్పటికే కల్కి మూవీ అడ్వాన్స్ బుకింగ్‌ను పలు చోట్ల బ్రేక్ చేసింది.
ఆన్‌లైన్ టికెటింగ్ వెబ్ సైట్ బుక్ మై షోలో ఈ సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. సెప్టెంబర్ 21వ తేదీన 35 వేల టికెట్లు, సెప్టెంబర్ 24వ తేదీన 107000 టికెట్లు, సెప్టెంబర్ 23వ తేదీన 370000 టికెట్లు అమ్ముడుపోయాయి.
ఓవర్సీస్ మార్కెట్‌లో జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు అనూహ్యమైన రెస్సాన్స్ కనిపిస్తున్నది. ఈ సినిమా తొలి రోజు నాటికి 3 మిలియన్ డాలర్లు అంటే.. 25 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ రిపోర్ట్