టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ ప్రకాశ్ రాజ్ పై ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం మాట్లాడుతుంటే.. అప్పటి నుంచే ఆయనంటే కొందరికి పడటం లేదని ప్రకాష్ రాజ్ ఇష్టం వచ్చినట్లు ఏదేదో మాట్లాడుతున్నాడని.. ప్రకాష్ రాజ్ స్వార్దపరుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనాడన్నా ఇండస్ట్రీ కోసం , ప్రజల కోసం ఎమన్నా చేశావా ప్రకాష్ రాజ్.. ప్రజ్వల్ రేవన్న ఇన్సిడెంట్ పై ఎందుకు స్పందించలేదు, రజనీకాంత్‌ను అన్నప్పుడు ఏమి స్పందించలేదు.. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్ పేరు చెప్పి దేవుడిని అవమానిస్తున్నాడని దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్ కాలి గోటికి ప్రకాష్ రాజ్ సరిపోడని.. ఇదంతా డైవర్షన్ కోసం చేస్తున్నట్టుందని అన్నారు. ప్రకాష్‌రాజ్.. జగన్, కేటీఆర్‌ల ఏజెంట్.. కొండా సురేఖపై ఇండస్ట్రీ ట్వీట్స్ వెనుక కూడా ప్రకాష్ రాజే ఉన్నాడని అనుమానంగా ఉందన్నారు. కేటీఆర్ కోసమే ఇదంతా చేసి ఉంటాడన్నారు. చిరంజీవి గారిని అవమానించినప్పుడు, ఐదు రూపాయల టికెట్ పెట్టినపుడు జగన్‌పై.. కేసీఆర్ ఇండస్ట్రీ అమ్మాయిలను డ్రగ్స్ పేరుతో నిలబెట్టినపుడు వారిపై ఎందుకు ట్వీట్ చేయలేదంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అప్పుడు ఉంది మీ ప్రభుత్వాలే అనే చేయలేదా.. టీడీపీ, పవన్ కల్యాణ్ అధికారంలో ఉంటేనే మీరు ట్వీట్లు వేస్తారా అని అన్నారు. ఇంకా.. రేణు దేశాయ్ గారు ట్రోలింగ్ గురైనపుడు ఇండస్ట్రీ ఏమైంది, భువనేశ్వరి గారిపై అసభ్యంగా మాట్లాడినపుడు ఇండస్ట్రీ ఏమైంది, రజినీకాంత్‌పై నీచంగా మాట్లాడినప్పుడు, చిరంజీవి తల్లి అంజనా దేవిపై పోసాని అసభ్యంగా మాట్లాడితే ఖండన ఏది.. ప్రకాష్ రాజ్ ట్వీట్ ఎందుకు వేయలా.. జగన్ కేసీఆర్ అంటే మీకు భయమా అని నిలదీశారు. ప్రకాష్ రాజ్ ధైర్యం ఉంటూ పొలిటికల్‌గా వచ్చి పవన్ కల్యాణ్ ను ఎదుర్కోవాలి.. అంతేకానీ ఇండస్ట్రీ ముసుగులో ట్వీట్స్ కరెక్ట్ కాదని హితవు పలికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa