మాస్ మహారాజా రవితేజ ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరోలలో ఒకరు. అతను చివరిగా 2022లో ధమాకా ద్వారా హిట్ సాధించారు. ఆ తర్వాత 'వాల్తేర్ వీరయ్య' విజయం సాధించిన క్రెడిట్ చిరుకే దక్కింది. అనంతరం రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలు చేసిన పెద్ద విజయం సాధించలేదు. ఈ ఏడాది హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్‌తో మరో డిజాస్టర్ సొంతం చేసుకున్నాడు.
ఈ క్రమంలో హిట్ సాధించడానికి రవితేజ కొన్ని రిస్కీ నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆ రిస్కీ డిసిషన్స్ ఏంటంటే.. ఇటీవల RT75 ఫిల్మ్ షూటింగ్ లో గాయపడిన రవితేజ ప్రస్తుతం డాక్టర్ల సూచనలమేరకు రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ గ్యాప్ లో కూడా ఆయన కొన్ని స్టోరీస్ వింటున్నారట. ఈ నేపథ్యంలోనే తమిళ్ డైరెక్టర్ సుందర్ సి రవితేజకి కథ చెప్పారట. రవితేజకి కూడా ఈ కథ నచ్చిందని విశ్వసనీయ సమాచారం. రజినీకాంత్ 'అరుణాచలం' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైనా సుందర్.. ఆ తర్వాత అరణ్మనై సిరీస్ తో మినహా పెద్దగా హిట్స్ సాధించలేకపోయారు. దీంతో ఇలాంటి సమయాల్లో రవితేజ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్టేనా అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ప్రస్తుతం రవితేజ RT 75 సినిమాకి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణంలో ఈ మూవీ 2025లో విడుదల కానుంది.