ట్రెండింగ్
Epaper    English    தமிழ்

12 వ రోజు దేవర కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 09, 2024, 12:18 PM

దేవర చిత్రంతో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తన కలెక్షన్ల దాహం తీర్చుకుంటున్నాడు. వసూళ్లపరంగా ఆర్ఆర్ఆర్‌తో సరికొత్త రికార్డులు నెలకొల్పినప్పటికీ ఇందులో రామ్ చరణ్, రాజమౌళి పాత్ర కూడా అంతే కీలకం.దీంతో సోలో హీరోగా తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. నార్త్, సౌత్ , ఓవర్సీస్ అన్న తేడా లేకుండా కలెక్షన్ల ఊచకోత కోస్తున్నాడు. విడుదలైన తొలి వారంలోనే లాభాలను తెచ్చిపెట్టిన దేవర.. 12 వ రోజు ఎన్ని కోట్లు సాధించిందో చూస్తే :జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన మూవీ కావడంతో దేవరపై భారీ అంచనాలున్నాయి. ఇందులో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించారు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు కీలకపాత్ర పోషించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందజేశారు. దేవరను ప్రమోషన్ కార్యక్రమాలతో కలుపుకుని రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివతో కలిసి ఎన్టీఆర్ నటించిన మూవీ కావడంతో దేవర ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం ఓ రేంజ్‌లో జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.112.55 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ.182.55 కోట్ల బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7,250 థియేటర్లలో రిలీజైన దేవర .. రూ.200 కోట్ల షేర్, రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్ల టార్గెట్‌తో బరిలో దిగింది. అయితే ఫస్ట్ డే ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్, చిత్ర యూనిట్ షాకైంది. కానీ టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది దేవర. ఏకంగా తొలి వారంలోనే రూ.400 కోట్లను చేరుకుని రూ.500 కోట్ల మార్క్‌ను కొట్టాలని కసిగా పరుగులు తీస్తోంది.


దేవర మొదటి రోజు రూ.172 కోట్లు, రెండో రోజు రూ.71 కోట్లు, మూడో రోజు రూ. 40 కోట్లు, నాలుగో రోజు రూ. 25 కోట్లు, ఐదో రోజు రూ.40కోట్లు, ఆరో రోజు రూ.40 కోట్లు, ఏడో రోజు రూ.20 కోట్లు, ఎనిమిదో రోజు రూ.13 కోట్లు, 9వ రోజు రూ.12 కోట్లు, 10వ రోజు రూ.19 కోట్లు, 11వ రోజు రూ.9 కోట్ల వసూళ్లను సాధించింది. మరి 12వ రోజు దేవర ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లో రూ.4.5 కోట్లు, హిందీ, తమిళ్, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా కలుపుకుని రూ.2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 75 లక్షల చొప్పున మొత్తంగా వరల్డ్ వైడ్‌గా రూ.7 కోట్ల వసూళ్లు సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


మరోవైపు .. దేవర కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తూ వెళ్తున్నాడు. తెలుగునాట సినిమాల జాతరకు పెట్టింది పేరైన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మొదటి రోజే రూ. కోటికి పైగా గ్రాస్ వసూళ్లను అందుకున్నాడు ఎన్టీఆర్. తాజాగా 11 రోజుల్లో రూ.2.66 కోట్ల గ్రాస్ అందుకుని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఆల్‌టైం టాప్ 4 ప్లేస్‌ను సొంతం చేసుకుంది. ఈ సెంటర్‌లో ఆర్ఆర్ఆర్ రూ.5.11 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో నెంబర్ వన్ ప్లేస్‌లో ఉండగా.. తర్వాత వరుసగా బాహుబలి 2 (రూ.3.76 కోట్లు), కల్కి రూ.3.61 కోట్లు, దేవర రూ. 2.66 కోట్లు (11 రోజుల్లో) , రంగస్థలం రూ.2.42 కోట్లు సాధించాయి.తాజాగా ఎన్టీఆర్ మరో రికార్డుపైనా కన్నేశాడు. టాలీవుడ్ ఎపిక్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటైన బాహుబలి 1 తెలుగు వెర్షన్ వసూళ్లను టార్గెట్ చేశాడు. వరల్డ్ వైడ్‌గా తెలుగు వర్షన్‌లో రూ.188 కోట్ల షేర్‌ను అందుకున్న దేవర.. మరో రూ.6 కోట్లు సాధిస్తే బాహుబలి 1 రికార్డులను బద్ధలుకొట్టే అవకాశం ఉంది. బాహుబలి 1 తెలుగు వెర్షన్ రూ.194 కోట్ల రేంజ్‌లో షేర్ అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఎన్టీఆర్ దేవర ఎలాంటి సంచలనాలను సృష్టిస్తోందో చూద్దాం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com