‘ఖైదీ’, ‘విక్రమ్’ చిత్రాలతో పాపులారిటీ సంపాదించుకున్నారు దర్శకుడు లోకేశ్ కనగరాజ్. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం ‘కూలీ’. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన అభిమానులతో కాసేపు ముచ్చటించారు. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ (ఎల్‌సీయూ-LCU)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ యూనివర్స్‌లో ‘కూలీ’ భాగం కాదన్నారు. ఆ సినిమా తర్వాత అదిరిపోయే ప్రాజెక్ట్ రానుందని.. ఎల్‌సీయూలో భాగమైన హీరోలందరితో ఇది ఉంటుందని అన్నారు. రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘కూలీ’ గురించి చెబుతూ ‘‘ఆరు నెలలకు మించి షూటింగ్ చేయడం నాకు నచ్చదు. ఇప్పటి వరకూ చేసిన సినిమాలన్నీ అంతలోపే పూర్తి చేశా. ‘కూలీ’ కూడా ఆ విధంగా చేయడానికి ప్రయత్నిస్తున్నా.
ఇటీవల రజనీకాంత్‌కు సర్జరీ జరిగీంది. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవడం నా బాధ్యత. అక్టోబర్ 16 నుంచి ఆయన సెట్స్‌లోకి తిరిగి అడుగుపెట్టనున్నారు’’ అని అన్నారు. తన భవిష్యత్తు ప్రణాళిక గురించి మాట్లాడుతూ.. ‘‘రానున్న ఐదేళ్లపాటు బ్లడ్, గన్స్ లేకుండా సినిమాలు ప్లాన్ చేయలేను. ఎందుకంటే ఇప్పటికే అలాంటి కథలకు కమిట్ అయ్యా. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’తో లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ మొదలైంది. దానిని సరైన విధంగా పూర్తి చేయాలి. ‘విక్రమ్’ని అద్భుతంగా పూర్తి చేేసందుకు ‘రోలెక్స్’ సీన్స్ క్రియేట్ చేశా. ఆ పాత్రకు వచ్చిన క్రేజ్ దృష్టిలో ఉంచుకుని ‘రోలెక్స్’పై ఒక స్టాండలో మూవీ చేయాలనుకుంటున్నా. ‘కూలీ’ పూర్తి చేసిన తర్వాత, ఎల్‌సీయూ హీరోలందరితో పీక్ ఎల్‌సీయూ మూవీ చేయనున్నాను’’ అని లోకేశ్ కనగరాజ్ అన్నారు.. ‘లియో 2’కు అవకాశం వస్తే తప్పకుండా చేస్తానన్నారు. దానికి పార్తిబన్ అనే టైటిల్ పెడతానని చెప్పారు.