సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య కొత్త బందంలోకి అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. శోభితా ధూళిపాళ్లతో త్వరలోనే ఏడడగులు నడిచేందుకు చై సిద్ధమవుతున్నారు.ఇప్పటికే వీరి ఎంగేజ్‌మెంట్ అత్యంత సన్నిహితుల సమక్షంలో జరగగా త్వరలోనే వివాహాన్ని జరిపేందుకు పెద్దలు నిశ్చయించారు.కాగా వీరి వివహాన్ని విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో నిర్వహించాలనే ప్లాన్‌లో ఉన్నారని ఇప్పటికే వచ్చాయి. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శోభిత కానీ, చైతన్య కానీ ఇప్పటి వరకు పెళ్లి గురించి ఎలాంటి పోస్ట్ చేయలేదు. అయితే తాజాగా నాగ చైతన్య కాబోయే భార్యతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ఎక్కడో ఒక లిఫ్ట్‌లో దిగిన ఫొటోను షేర్ చేసిన చైతన్య.. ''ఎవ్రిథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్'' అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించారు.
అయితే ఇక్కడే చైతన్య ఇక్కడే ఓ ట్విస్ట్ ఇచ్చారు. సాధారణంగా ఏ పోస్ట్‌కు అయినా కామెంట్స్ ఆప్షన్ ఆన్‌లోనే ఉంటుంది. అయితే నాగ చైతన్య ఈ ఫొటోకు కామెంట్స్ సెక్షన్ ఆఫ్ చేశారు. ఈ ఫీచర్ ఆఫ్ చేయడం వల్ల నెటిజన్లు సదరు పోస్టుకు కామెంట్స్ చేయలేరన్నమాట. ఎందుకొచ్చిన సమస్య అనున్నారో, ఎలాంటి కామెంట్స్ వస్తాయనుకున్నారో కానీ కామెంట్స్ సెక్షన్‌ను ఆఫ్ చేసేశారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఎలాగో కామెంట్ ఆఫ్ చేశారు కాబట్టి.. ఫ్యాన్స్ లైక్స్‌తో వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 2.5 లక్షల వరకు లైక్స్ వచ్చాయి.