హాలీవుడ్ ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీస్పియర్స్ 42 ఏళ్ల వయసులో నాలుగో పెళ్లి చేసుకుంది. అయితే ఈసారి తనను తానే పెళ్లాడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ‘ఇది మీకు తెలివి తక్కువ పనిలా అనిపించవచ్చు. కానీ నాకు మాత్రం ఇప్పటివరకు నేను చేసిన వాటిలో ఇదొక గొప్ప విషయం’ అని భావిస్తున్నానని ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది. కాగా, బ్రిట్నీస్పియర్స్ ఇప్పటివరకు ముగ్గురిని వివాహం చేసుకుంది.