ఒకే ఓటీటీలోకి మూడు హాలీవుడ్ బోల్డ్ మూవీస్ తెలుగులో రావడం విశేషం. 2015 నుంచి 2018 మధ్య ఈ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన ఈ మూడు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాయి.ఈఎల్ జేమ్స్ రాసిన ఫిఫ్టీ షేడ్స్ నవలల ఆధారంగా ఈ మూవీస్ తెరకెక్కాయి. న్యూడ్ సీన్స్ తో వచ్చిన ఈ సినిమాలకు రివ్యూలు నెగటివ్ గానే ఉన్నా.. వసూళ్లలో మాత్రం రికార్డులు తిరగరాశాయి.హాలీవుడ్ లో వచ్చిన సినిమాల సిరీస్ ఫిఫ్టీ షేడ్స్. 2015లో తొలిసారి ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే, ఆ తర్వాత 2017లో ఫిఫ్టీ షేడ్స్ డార్కర్, 2018లో ఫిఫ్టీ షేడ్స్ ఫ్రీడ్ అనే మూవీస్ వచ్చాయి.ఇన్నాళ్లూ ఇంగ్లిష్ లోనే అందుబాటులో ఉన్న ఈ సినిమాలన్నీ ఇప్పుడు జియో సినిమా ఓటీటీలో తెలుగుతోపాటు తమిళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలోనూ ఈ సినిమాలు ఇంగ్లిష్ లో అందుబాటులో ఉన్నాయి. తెలుగులో చూడాలనుకుంటే మాత్రం జియో సినిమా ప్రీమియంలో చూడొచ్చు.
ఫిఫ్టీ షేడ్స్ ఫిల్మ్ సిరీస్ మొత్తం న్యూడ్ సీన్లతో రచ్చ రచ్చ చేశాయి. ముఖ్యంగా 2015లో వచ్చిన తొలి మూవీ ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే చూసిన ఫ్యాన్స్ షాక్ తిన్నారు. డకోటా జాన్సన్, జేమీ డోర్నన్ నటించిన ఈ సినిమాల్లో మొదటి మూవీకి సామ్ టేలర్ జాన్సన్ డైరెక్ట్ చేయగా.. తర్వాతి రెండు సినిమాలను జేమ్స్ ఫోలీ డైరెక్ట్ చేశాడు.ఓ లిటరేచర్ స్టూడెంట్, ఓ ధనవంతుడైన వ్యాపారవేత్త మధ్య కలిగే ఆకర్షణతో ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ డ్రే మూవీ సాగుతుంది. అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లి అతని అందానికి పడిపోయిన ఆ స్టూడెంట్.. తర్వాత ఆ వ్యక్తి కోరుకున్నట్లుగా అతనికి సెక్యువల్ ఫేవర్స్ అందిస్తూ ఉంటుంది.ఈ క్రమంలో వచ్చే న్యూడ్ సీన్స్ చాలా బోల్డ్ గా ఉంటాయి. సాధారణంగా పూర్తి న్యూడ్ సీన్లతో ఉండే సినిమాలు తక్కువగా ఉంటాయి. కానీ ఈ ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే మూవీలో చాలా సీన్లలో లీడ్ రోల్స్ ఇద్దరూ పూర్తి నగ్నంగా కనిపిస్తారు. ఆ ఇద్దరి ఆకర్షణ, ప్రేమ నుంచి పెళ్లి వరకూ మూడు భాగాలుగా ఈ ఫిఫ్టీ షేడ్స్ సినిమాలు వచ్చాయి.