బిగ్‌బాస్ సీజన్ 7లో ఎలిమినేషన్స్ జరిగినట్లే ఈ వారం కూడా కుండ పగలకొట్టే థీమ్ తో నామినేషన్స్ ప్లాన్ చేశారు. కాగా కంటెస్టెంట్స్.. ఇంట్లో ఉండటానికి అర్హతలేని ఇద్దరి సభ్యుల దిష్టి బొమ్మల మీద కుండలు పెట్టి రీజన్స్ తెలిపి వాటిని పగలగొట్టాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. మొదటగా విష్ణుప్రియ నామినేషన్ ప్రక్రియ మొదలుపెడుతూ.. నిఖిల్‌ని నామినేట్ చేస్తూ.. మణికంఠ విషయంలో నువ్వు మెహబూబ్ కి పాయింట్ ఇవ్వకుండా ఉండాల్సింది అంటూ కుండ పగలగొట్టింది. దీనికి కౌంటర్ గా నిఖిల్.. నువ్వు కూడా ఫుడ్ కోసం పాయింట్ ఇచ్చేశావ్ కదా అంటూ అడిగాడు. దీనికి విష్ణు నేను ఒకే పాయింట్ ఇచ్ఛా అంది, దీనికి రిప్లైగా నిఖిల్ మరి నేను ఒకటే ఇచ్ఛా అంటూ సూపర్ పంచ్ ల్యాండ్ చేశాడు.
నెక్స్ట్ ప్రేరణని నామినేట్ విష్ణుప్రియకి తను కూడా స్ట్రాంగ్ కౌంటర్‌తో కంబ్యాక్ ఇచ్చింది. ఇక అసలు హీట్ ఎక్కించింది రోహిణి.. పృథ్వీని నామినేట్ చేస్తూ " అసలు చెప్పిన రూల్స్ నువ్వు వినవ్.. సెల్ఫిష్‌గా ఆడతావ్" అంటూ రోహిణి చెప్పింది. దీంతో పృథ్వీ నా స్ట్రాటజీ నా ఇష్టం అంటూ కౌంటర్ ఇచ్చాడు. అయితే నువ్వు విష్ణు పక్కన లేకపోతే నామినేషన్స్ లో తప్ప ఎక్కడ కనపడవు అంటూ రోహిణి ఫైర్ అయ్యింది. దీంతో విష్ణు కూడా కోపంతో రోహిణి ముందున్న కుండని పగలకొట్టాడు. మీరు ఆటలో జీరో అంటూ పృథ్వీ చెప్పిన కారణానికి రోహిణి నేను ప్రయత్నం చేయలేదా అని అడిగింది. దీనికి పృథ్వీ.. ట్రై చేస్తావ్ కానీ విన్ కాలేదుగా అన్నాడు. దీంతో రోహిణి మండిపడుతూ.. నువ్వు ఒక్కసారి అయినా చీఫ్ అయ్యావా.. నీ దగ్గర ఆడే మేటర్, మాట్లాడే మేటర్ ఏం లేదంటూ కౌంటర్ ఇచ్చింది. ఇక పృథ్వీ గేమ్ ఆడినప్పుడు రన్నింగ్ కూడా రావాలి కదా.. మీరనుకున్నంత ఈజీ కాదు పరిగెత్తడం అంటూ రోహిణిని పైనుంచి కిందకు చూశాడు. దీంతో రోహిణి ఏంటి ఆ చూపేంటి.. నువ్వు నన్ను చూసిన విధానం కరెక్ట్ కాదు అంటూ నిలదీసింది.