ఈరోజు చాలా సంతోషంగా ఉందని రేణూదేశాయ్ తెలిపారు. తాజాగా ఆమె ఓ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ‘‘చిన్నతనం నుంచి మూగ జీవాలను సంరక్షించడం నాకు ఇష్టం. మూగ జీవాల కోసం నా గళాన్ని వినిపించాలని, వాటి రక్షణ కోసం ఇంకా ఏదైనా చేయాలని కొవిడ్ సమయంలో నిర్ణయించుకున్నా. ఆ మేరకు ప్రయత్నాలు ప్రారంభించా. నా సొంత ఎన్జీవోను రిజిస్టర్ చేయించా ’’ అని ఆమె తెలిపారు. ఆర్థిక సాయం చేయాలనుకునే వారు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa